మహిళల టీ20 ఆసియా కప్ 2026లో భారత జట్టు తరఫున ఆడుతున్న తెలుగు క్రికెటర్ శ్రీ చరణి చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ కడప బిడ్డ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన శ్రీ చరణి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. జువైరియా ఫెర్దౌస్ వికెట్ తీసుకోవడం ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకుంది.
శ్రీ చరణి కేవలం 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించి అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరిట ఉండేది. కుల్దీప్ 2023లో 30 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు పూర్తి చేశాడు. శ్రీ చరణి ఒక మ్యాచ్ తక్కువలోనే ఈ రికార్డును అధిగమించింది.
భారత పురుష, మహిళా క్రికెటర్లను కలిపి చూసినా అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన ప్లేయర్‌గా శ్రీ చరణి ప్రత్యేక గుర్తింపు పొందింది.
మహిళల క్రికెట్‌లో మాత్రం ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న రెండో ప్లేయర్‌గా నిలిచింది. చైనాకు చెందిన మెంగ్టింగ్ లియు 28 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు సాధించగా, శ్రీ చరణి 29 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించింది.
ఇక 22 ఏళ్ల 37 రోజుల వయసులో 50 వికెట్ల మైలురాయి చేరుకున్న శ్రీ చరణి.. భారత మహిళా క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది.
తెలుగు తేజం శ్రీ చరణి చరిత్ర.. అత్యంత వేగంగా 50 టీ20 వికెట్లు తీసిన భారత ప్లేయర్‌గా రికార్డు
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash