ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భార్య తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసినప్పుడు భర్త ఆగ్రహానికి గురికావడం, పోలీసులను ఆశ్రయించడం లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంటుంది. అయితే ఈ ఘటనలో భర్త తీసుకున్న నిర్ణయం మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది.లక్నోకు చెందిన ఓ పీఆర్డీ జవాన్‌కు ఏడాది క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితం అతని భార్య అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కోసం భర్త వెతకడం ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించారు. చివరకు ఆమె హర్దోయ్‌లో తన ప్రియుడితో కలిసి ఉన్నట్లు భర్తకు సమాచారం అందింది.వెంటనే అక్కడికి వెళ్లిన భర్త.. భార్యతో పాటు ఆమె ప్రియుడితో మాట్లాడాడు. వారిద్దరూ గతంలో కలిసి చదువుకున్నారని, అప్పటి నుంచే ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగానే తన భార్య తనను వివాహం చేసుకున్నప్పటికీ, ఆమె తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తోందని అతనికి అర్థమైంది.అంతేకాకుండా తనతో కలిసి జీవించడానికి భార్యకు ఆసక్తి లేదని తెలుసుకున్న తర్వాత ఆ భర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భార్య తన ప్రియుడితోనే సంతోషంగా జీవించాలనుకుంటే ఆమెను బలవంతంగా తనతో ఉంచడం సరికాదని భావించాడు. దీంతో కుటుంబ సభ్యులను ఒప్పించి, వారి సమక్షంలోనే తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించినట్లు సమాచారం.భార్యను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించకుండా, ఆమె ఇష్టాన్ని గౌరవించి ప్రియుడితో పెళ్లి చేయించిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. వెతికి పట్టుకున్న భర్త ఏం చేశాడంటే?
1
Published: 📅
Reported by: 🖊
Banu Prakash