తిరుమలలో ఈ నెలలో జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానం అందించింది. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రు, పనబాక లక్ష్మీ, జానకీదేవి ముఖ్యమంత్రిని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనం అందించారు.ఆ తర్వాత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్, ఈవోలతో చర్చించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. అనంతరం నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి నిర్వహించే వివిధ వాహన సేవలు, విశేష ఉత్సవాలు, ఇతర ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు తెలియజేసేందుకు టీటీడీ ఇప్పటికే ప్రత్యేక బుక్‌లెట్‌ను విడుదల చేసింది.
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
2
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan