చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం ఉదయం న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్.. ఏడేళ్ల తర్వాత దేశ రాజధానికి చేరుకున్నారు. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద పరిస్థితులు, సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, పెట్టుబడులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల భారత్-చైనా సంబంధాల్లో చోటుచేసుకున్న పురోగతిని కూడా ఇరువురు నేతలు సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.గల్వాన్ ఘర్షణతో దెబ్బతిన్న సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి 2024 నుంచి ఇరు దేశాలు పలు చర్యలు చేపట్టాయి. సరిహద్దుల్లో సైనిక బలగాల ఉపసంహరణతో పాటు వీసాలు, వాణిజ్యం, ప్రత్యక్ష విమాన సర్వీసుల విషయంలోనూ పురోగతి కనిపించింది.జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రిక్స్ సదస్సు జరిగే భారత్ మండపం పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మోదీ-జిన్‌పింగ్ భేటీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు తదుపరి దశను నిర్దేశిస్తుందా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ఢిల్లీలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. మోదీతో కీలక భేటీ
2
Published: 📅
Reported by: 🖊
Banu Prakash