డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్–హరియాణా హైకోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కూడా రద్దు చేసింది. అయితే మహిళలపై అత్యాచారం కేసులో 2017 నుంచి డేరా బాబా జైలులోనే ఉన్నారు. ఈ కేసులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు 15 సార్లు పెరోల్‌పై బయటికి వచ్చి వెళ్లినట్లు సమాచారం.