జూనియర్ ఆసియా కప్‌లో భారత మహిళా హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు 5-1 తేడాతో ఘన విజయం సాధించారు. టోర్నీలో ఇప్పటివరకు చూపించిన దూకుడును కొనసాగిస్తూ కీలక మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించారు.భారత విజయంలో సుప్రియ కీలక పాత్ర పోషించింది. ఆమె అద్భుత ఆటతీరుతో ఏకంగా మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ నమోదు చేసింది. దీంతో దక్షిణ కొరియా రక్షణపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. మధు సిదార్, సుఖ్వీర్ కౌర్ చెరో గోల్ చేసి భారత స్కోరును మరింత పెంచారు. దక్షిణ కొరియా తరఫున యురి జెంగో ఒక్క గోల్ సాధించింది.అంతకుముందు క్వార్టర్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 19-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసి సెమీ ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు, అదే జోరును కొరియాపై కూడా కొనసాగించింది. సెమీ ఫైనల్‌లో దక్షిణ కొరియా కొంత ప్రతిఘటన చూపించినప్పటికీ భారత ఆటగాళ్లు ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా సమర్థంగా ఆడారు.ఈ విజయంతో భారత మహిళా జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. మరో సెమీ ఫైనల్‌లో చైనా, జపాన్ జట్లు తలపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టుతో భారత్ ఫైనల్లో టైటిల్ కోసం పోరాడనుంది. ఇదే టోర్నీలో భారత పురుషుల జట్టు కూడా ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడం విశేషం
జూనియర్ ఆసియా కప్ ఫైనల్‌కు భారత మహిళా హాకీ జట్టు.. కొరియాపై ఘన విజయం
1
Published: 📅
Reported by: 🖊
Banu Prakash