బంగారం ధరలు మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం హైదరాబాద్, విజయవాడతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,410గా ఉంది. శుక్రవారం ఉదయం ఇదే బంగారం ధర రూ.1,52,890గా ఉండగా, ఒక్క రోజులో రూ.1,520 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,540గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఇది రూ.1,390 పెరిగింది.వెండి ధర కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,49,900కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.2,45,000గా ఉండగా, శనివారం రూ.4,900 మేర పెరిగింది.తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,410గా ఉంది. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలోనూ ఇదే ధర నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,54,560గా ఉండగా, అహ్మదాబాద్‌లో రూ.1,54,460గా ఉంది.బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి తనిఖీ చేసుకోవడం మంచిది.
పెరిగిన బంగారం ధర.. రూ.1.54 లక్షలకు చేరిన 24 క్యారెట్ల పసిడి
1
Published: 📅
Reported by: 🖊
Banu Prakash