ఏలూరు జిల్లాలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం లింగగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో పలువురు ప్రయాణికులు ఉండటంతో ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్ నుంచి విజయనగరం వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. మరో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి, గాయపడిన ప్రయాణికుల పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.ప్రమాదం కారణంగా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి బస్సు వేగమే కారణమా, మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
2
Published: 📅
Reported by: 🖊
Banu Prakash