తమిళనాడు రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మదురై, తేని, దిండుగల్, విరుదునగర్, శివగంగ జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి మన్నార్ గల్ఫ్ వరకు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో బలహీనమైన అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.అదే సమయంలో దక్షిణ తమిళనాడు, అంతర్గత జిల్లాల్లో ఎక్కువగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.రాజధాని చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైలో గరిష్ట ఉష్ణోగ్రత 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది
తమిళనాడులో ఐదు జిల్లాలకు వర్ష సూచన.. చెన్నైలోనూ మోస్తరు వర్షాలు
1
Published: 📅
Reported by: 🖊
Banu Prakash