హైదరాబాద్, సెప్టెంబర్ 15: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దమనకాండ కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, రక్తపు గుర్తులు తెలంగాణ చరిత్రలో కనిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో నిజాం పాలనకు ముగింపు పలికి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ గడ్డకు విముక్తి లభించిందని తెలిపారు. విమోచన చరిత్రను గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు సెప్టెంబర్ 17న విమోచన వేడుకలు నిర్వహించడానికి ఎందుకు భయపడుతున్నాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిళ్లకు లోబడి ఈ రెండు పార్టీలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. 1990లలో హైదరాబాద్ ముక్తి దివస్ నిర్వహణ కోసం అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. గత ఐదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నాయకత్వంలో ఈ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు.
సెప్టెంబర్ 17న నిర్వహించే విమోచన వేడుకలకు హైదరాబాద్, తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా హాజరు కావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇది రాజకీయ అంశం కాదని, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం ప్రభుత్వాల బాధ్యత అని, అందుకే విమోచన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలకు సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని పేర్కొన్నారు.
Hashtags:
తెలంగాణ ఏర్పాటు తర్వాత దమనకాండ నడుస్తోంది: కిషన్‌రెడ్డి
2
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan