హైదరాబాద్, సెప్టెంబర్ 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో మూసీ నది పునరుజ్జీవం, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ తదితర అంశాలపై చర్చించారు. అగా ఖాన్ ఫౌండేషన్‌పై తనకు అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనాన్ని ఇటీవల పునరుద్ధరించుకున్నామని తెలిపారు. అలాగే కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణలోనూ అగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.
మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు.
మూసీ నదిని నైట్ ఎకానమీకి అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సీఎం తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కూడా గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు
3
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati