విజయవాడ, సెప్టెంబర్ 15: విజయవాడలో పేలుడు పదార్థాల స్వాధీనం కలకలం రేపింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 46 జిలిటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట నుంచి విజయవాడకు యూపీకి చెందిన ఆసిఫ్ అలీ బస్సులో వచ్చాడు. అయితే విజయవాడ చేరుకున్న తర్వాత తన బ్యాగ్‌కు బదులుగా మరో బ్యాగ్ ఉండటాన్ని గుర్తించాడు. అనుమానం రావడంతో ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే బస్టాండ్ అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ బస్సులో ప్రయాణించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.
46 జిలిటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ పేలుడు పదార్థాల వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు గాలింపు కొనసాగుతోంది. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కృష్ణలంక పోలీసులు ప్రజలకు సూచించారు.
Hashtags:
విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. 46 జిలిటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు స్వాధీనం
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri