టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. అహ్మదాబాద్ పిచ్‌పై 175–200 పరుగులు సాధారణ స్కోరు కావచ్చని చెప్పారు. ఒకవేళ న్యూజిలాండ్ 225–250 వరకు చేస్తే భారత్‌పై భారీ ప్రెజర్ పడుతుందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే 150 కోట్ల మంది మ్యాచ్‌ను చూస్తారని తెలిపారు. ఇదే మైదానంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిందని గుర్తుచేశారు.