యూపీఎస్సీ ఫలితాల్లో బిహార్‌కు చెందిన రవి రాజ్ ప్రత్యేకంగా నిలిచారు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా పట్టుదలతో చదివి దేశవ్యాప్తంగా 20వ ర్యాంకు సాధించారు. ఈ ప్రయాణంలో ఆయన తల్లి విభ కీలక పాత్ర పోషించారు. పుస్తకాలు చదివి వినిపిస్తూ, నోట్స్ రాస్తూ కుమారుడిని ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు. ఇప్పటికే BPSCలో కూడా రాణించిన రవి, కష్టానికి తల్లి ప్రేమ తోడైతే విజయం సాధ్యమేనని ప్రపంచానికి చాటిచెప్పారు.
చూపు కోల్పోయినా IAS… రవి రాజ్ ప్రేరణాత్మక విజయగాథ
5
Published on: 📅 07 Mar 2026, 08:57 AM
Reported by: 🖊
Suresh Reddy