ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఇంటింటి గణన గడువును భారత ఎన్నికల సంఘం పది రోజులపాటు పొడిగించింది. జూన్ 15న ప్రారంభమైన బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శనలు గత షెడ్యూల్ ప్రకారం జూలై 14తో ముగియాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో జూలై 24 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చేసిన విజ్ఞప్తి తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను సవరించింది.
అనేక నియోజకవర్గాల్లో గణన పత్రాల సేకరణ పూర్తికాకపోవడం, ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇళ్లు తాళాలు వేసి ఉండటం, చిరునామాలు మారడం వంటి కారణాలతో అదనపు సమయం కోరినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్లు, రాజకీయ పార్టీల నుంచి కూడా గడువు పెంపు అభ్యర్థనలు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. సేకరించలేని పత్రం ఉన్నంత మాత్రాన సంబంధిత ఓటరు పేరు తొలగించినట్లు భావించకూడదని అధికారులు స్పష్టం చేశారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జూలై 24లోగా పూర్తవుతుంది. ముసాయిదా జాబితా జూలై 31న విడుదలవుతుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు అవకాశం ఉంటుంది. వాటి పరిశీలన సెప్టెంబర్ 28 వరకు కొనసాగి, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 3న వెలువడనుంది. ఓటర్లు ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఏపీలో ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే గడువు జూలై 24 వరకు
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan