ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల గ్రౌండింగ్‌కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్‌తో సోమవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అమలు, పరిశ్రమల అభివృద్ధి, విద్యా సంస్కరణలు, ద్వైపాక్షిక సహకారంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 750 పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. పెట్టుబడుల ప్రకటనలకే పరిమితం కాకుండా వాటి గ్రౌండింగ్‌పై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్ణీత గడువుల్లో పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో 22 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగినట్లు పేర్కొన్నారు.
సింగపూర్‌తో సాంకేతికత, వాణిజ్యం, సముద్ర రంగం, పెట్టుబడులు, విద్య వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని లోకేశ్ తెలిపారు. ఇటీవల ఏపీ ఉపాధ్యాయుల బృందం సింగపూర్ అధ్యయన పర్యటనకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేస్తూ, విద్యా రంగంలో కూడా పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. రష్యా పర్యటనలో పరిశీలించిన అంశాలను కూడా ఈ సందర్భంగా పంచుకున్నట్లు తెలిపారు.
సమావేశంలో మాట్లాడిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని అభినందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పెట్టుబడులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహక విధానాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరువురి మధ్య సహకారం మరింత విస్తరించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పెట్టుబడుల గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం.. సింగపూర్‌తో ఏపీ కీలక చర్చలు
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan