పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో దేశీయ సూచీలు లాభనష్టాల మధ్య ట్రేడవుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడం రూపాయికి కొంత మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి 94.31 వద్ద కొనసాగుతోంది. అయితే ఈ పరిణామం మార్కెట్‌ను పూర్తిగా స్థిరపరచలేకపోయింది.
సెన్సెక్స్ ప్రారంభంలో స్వల్ప నష్టాలతో మొదలై కొద్దిసేపు లాభాల్లోకి వచ్చినప్పటికీ మళ్లీ నష్టాల్లోకి జారింది. మరోవైపు నిఫ్టీ స్వల్ప లాభాలతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ, మిడ్‌క్యాప్ సూచీలు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జీఎమ్‌ఆర్ ఎయిర్‌పోర్ట్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, మోతీలాల్ ఓస్వాల్ వంటి కంపెనీల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు పెర్సిస్టెంట్, ఆస్ట్రాల్, వారీ ఎనర్జీస్, సుప్రీమ్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్ దిశపై అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, బ్యాంకింగ్ రంగ పనితీరు కీలక ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ ప్రభావం.. లాభనష్టాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్
6
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan