కిష్టంశెట్టిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించి సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రజా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల అండ ఉంటే ఏ కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి తనకు వస్తుందని అన్నారు. మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంజీవని వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు చెప్పారు. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని అమలు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలని, పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. యూరియా అధికంగా వాడితే పంట నాణ్యత దెబ్బతింటుందని చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
పెద్ద కుటుంబాల అంశంపైనా చంద్రబాబు స్పందించారు. భవిష్యత్తులో పెద్ద కుటుంబాలను ఆదరిస్తామని చెప్పారు. జనాభా తగ్గుతున్న ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచే ఆలోచించాలన్నారు.
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిని నంబర్ వన్ రాజధానిగా నిర్మిస్తామని, ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దుతామని అన్నారు.
పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సీఎం చంద్రబాబు
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan