హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తును నిర్ణయించే కీలక చర్చలు ఢిల్లీలో విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, జి. కిషన్ రెడ్డిలతో సమావేశమై మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రధాన అడ్డంకులను తొలగించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఫేజ్-1 ప్రాజెక్టు విలువ, అప్పులు, నిధుల సమీకరణ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి SBICAPSను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. అలాగే ఫేజ్-2 కింద ప్రతిపాదించిన మార్గాల నిర్మాణ వ్యయం, నిధుల సమీకరణ, రుణ సంస్థల ఎంపికపై నివేదిక ఇవ్వనుంది.
కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు అమలు వేగవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. డీపీఆర్ సవరణలు, అనుమతులు, అమలు ప్రక్రియలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
ఈ పరిణామంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ఆమోదం పొందే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు కీలక ఊరట.. విస్తరణకు గ్రీన్ సిగ్నల్
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan