కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలోని దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జూన్ 6న మధ్యాహ్నం చిన్నారి ఇంటి పరిసరాల నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం కొద్దినిమిషాల వ్యవధిలోనే పాప ఆచూకీ తెలియకపోవడం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చింది.
సీసీటీవీ ఫుటేజీలో చిన్నారి ఒంటరిగా పామాయిల్ తోట వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత ఆమెను కొండ ప్రాంతం వైపు పెంపుడు కుక్కతో కలిసి చూసినట్లు ఒక స్థానికుడు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. కుటుంబం మొదట తోట ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు ఈ కేసును సాధారణ మిస్సింగ్ కేసుగా తీసుకోకుండా విస్తృత గాలింపు ప్రారంభించారు. పది ప్రత్యేక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్, అటవీశాఖ సిబ్బంది కలిసి సుమారు 500 ఎకరాల పరిధిలో శోధన కొనసాగిస్తున్నారు. దట్టమైన పొదలు, చెరువులు, కొండ ప్రాంతాలు, బోరుబావులు, తోటల పరిసరాలను తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, మెటల్ డిటెక్టర్లు కూడా వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఈ కేసులో పెంపుడు కుక్క పరిణామం పెద్ద మలుపుగా మారింది. చిన్నారితో వెళ్లినట్లు చెబుతున్న కుక్క మూడు రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. దాని కదలికల ద్వారా చిన్నారి ఆచూకీ దొరుకుతుందని భావించిన పోలీసులు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. అయితే దాని ద్వారా స్పష్టమైన క్లూ రాకముందే కుక్క మృతి చెందడం దర్యాప్తును మరింత సంక్లిష్టం చేసింది. కుక్క మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కారణం తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది.
మరోవైపు కుటుంబ సభ్యులు, స్థానికులు, బంధువుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తండ్రి గణేష్ నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబ విభేదాలు, అపహరణ అనుమానం, అడవి జంతువుల కదలికలు, సీసీటీవీ ఆధారాలు, కాల్ డేటా వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. జంతువుల కదలికలను
జ్ఞానేశ్వరి కేసులో పెంపుడు కుక్క మృతి దర్యాప్తుకు కొత్త మలుపు
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan