సింగపూర్‌లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధి ప్రణాళికను అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల ముందు వివరించారు. అమరావతిని ప్రత్యక్షంగా సందర్శించి, సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పెట్టుబడిదారులకు ఆయన పిలుపునిచ్చారు.
సమ్మిట్‌లోని లీడర్‌షిప్ ప్లీనరీ-2లో ‘కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్’ అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. 25 ఏళ్ల క్రితం తాను ఐటీ గురించి మాట్లాడినప్పుడు వచ్చిన ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వల్ల తెలుగువాళ్లు తలసరి ఆదాయంలో ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చిందని, దాన్ని ప్రజల జీవిత ప్రమాణాల పెంపుకు ఉపయోగించుకోవాలని చెప్పారు.
అమరావతి నిర్మాణంలో ‘పీపుల్ ఫస్ట్’ తమ ప్రధాన విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈక్విటీ, నేచర్, ఆపర్చ్యునిటీ, లివబుల్ సిటీ అనే అంశాలపై రాజధానిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులతో అమరావతిని అవకాశాల వేదికగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
కృష్ణా నది, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఐకానిక్ బ్రిడ్జిలతో అమరావతి ప్రత్యేక నగరంగా రూపుదిద్దుకుంటోందని సీఎం చెప్పారు. స్పోర్ట్స్, ఫైనాన్షియల్, నాలెడ్జ్, జస్టిస్, టూరిజం, హెల్త్, మీడియా వంటి కాన్సెప్ట్‌ల ఆధారంగా నగర అభివృద్ధి జరుగుతోందన్నారు. రైతులు ఒకే పిలుపుతో రాజధాని కోసం 35 వేల ఎకరాలు ఇచ్చారని, అభివృద్ధి చేసిన తర్వాత వారికే ప్లాట్లుగా తిరిగి అందిస్తున్నామని తెలిపారు.
అమరావతి 21 కిలోమీటర్ల పొడవునా వాటర్ ఫ్రంట్ నగరంగా ఉంటుందని చంద్రబాబు వివరించారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, అండర్ గ్రౌండ్ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో లక్ష్యాలతో రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
సైబరాబాద్‌లో ఒకప్పుడు ఎకరం రూ.2 లక్షలు ఉండగా, ఇప్పుడు భారీగా విలువ పెరిగిందని ఆయన ఉదాహరణగా చెప్పారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టి సాధ్యమవుతుందని, అమరావతి కూడా అలాంటి ఆర్థిక వృద్ధి కేంద్రంగా మారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు,
చంద్రబాబు పిలుపు: అమరావతిలో పెట్టుబడులు పెట్టండి
12
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan