ఆదోనికి చెందిన ఇద్దరు చిన్నారులు మంత్రి నారా లోకేశ్‌ను కలవాలని కోరుతూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహస్ర ఆద్య, జయ స్కంద అనే చిన్నారులు తమ కుటుంబ సభ్యులు తరచూ లోకేశ్‌తో ఫొటోలు దిగుతున్నారని, అయితే తమకు మాత్రం ఆయనను కలిసే అవకాశం రావడం లేదని వీడియోలో అమాయకంగా చెప్పారు. లోకేశ్ ఆదోనికి వస్తున్న నేపథ్యంలో తమను కూడా ఆయన వద్దకు తీసుకురావాలని తండ్రికి చెప్పాలంటూ వారు విజ్ఞప్తి చేశారు.
“లోకేశ్ సర్.. ఎప్పుడూ మా నాన్న, తాతే మీ దగ్గర ఫొటో దిగుతున్నారు. నేను ఫొటో దిగాలనుకున్నప్పుడు మీరు ఎక్కడో ఉంటున్నారు. మీరు ఆదోనికి వస్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా తీసుకురావాలని మా నాన్నకు చెప్పండి” అనే భావంతో చిన్నారులు చేసిన విజ్ఞప్తి నెటిజన్లను ఆకట్టుకుంది. పిల్లల సహజమైన మాటలు, అభిమాన నాయకుడిని కలవాలనే వారి ఆసక్తి వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
చిన్నారుల వీడియో తన దృష్టికి రావడంతో మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. ఆ వీడియోను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో రీపోస్ట్ చేసిన ఆయన, తాను కూడా వారిని కలవడానికి ఎదురుచూస్తున్నానంటూ సందేశం పంపించారు. చిన్నారుల కోరికను గమనించి స్పందించిన లోకేశ్ తీరు వారి కుటుంబ సభ్యులు, స్థానికుల్లో ఆనందాన్ని కలిగించింది.
చిన్నారుల వీడియోతో పాటు లోకేశ్ స్పందన కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోబడుతోంది. పిల్లల విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేయకుండా స్పందించడం అభినందనీయమంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాలు, ప్రజా సమావేశాల మధ్య చిన్నారుల సందేశానికి ప్రాధాన్యం ఇవ్వడం సానుకూల సంకేతమని కొందరు అభిప్రాయపడుతున్నారు
ఆదోని చిన్నారుల వీడియోకు లోకేశ్ స్పందన.. కలుసుకుందామంటూ ఆప్యాయ సందేశం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan