వాషింగ్టన్: అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై దాదాపు రెండు వారాలుగా కొనసాగించిన వైమానిక దాడులకు అమెరికా తాత్కాలిక విరామం ఇచ్చింది. ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు ముందుకు సాగేందుకు అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అమెరికా అధికారులు వెల్లడించారు.
చర్చలకు కొంత అవకాశం ఇస్తున్న ట్రంప్ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడుతూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం దౌత్య ప్రయత్నాలకు “కొంత అవకాశం” కల్పిస్తున్నారని చెప్పారు. వివిధ స్థాయుల్లో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, వాటి స్వరూపం, మధ్యవర్తుల వివరాలు, అమెరికా పెట్టిన షరతులను ఆయన పూర్తిగా వెల్లడించలేదు.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అమెరికా యుద్ధం ముగిసిందని ప్రకటించలేదు. దాడులు తాత్కాలికంగా నిలిచినప్పటికీ, అన్ని సైనిక ప్రత్యామ్నాయాలు ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందువల్ల దీనిని పూర్తి స్థాయి కాల్పుల విరమణగా పేర్కొనడం తొందరపాటు అవుతుంది.
ఇరాన్ నుంచి కూడా దాడులకు విరామంఅమెరికా దాడులు నిలిచిన తర్వాత ఇరాన్ కూడా పొరుగు దేశాలు, అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులను తాత్కాలికంగా నిలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇరు పక్షాలు రెండో రోజూ సైనిక చర్యలకు దూరంగా ఉండటం దౌత్య ప్రయత్నాలకు అనుకూల పరిణామంగా మధ్యవర్తులు భావిస్తున్నారు.
అమెరికా విరామాన్ని కొనసాగించినంత కాలం తాము కూడా గల్ఫ్ ప్రాంతంపై దాడులకు దిగబోమని ఇరాన్‌కు చెందిన సీనియర్ వర్గాలు సంకేతాలిచ్చినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం నుంచి శాశ్వత కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
దౌత్య చర్చలకు అవకాశం.. ఇరాన్‌పై అమెరికా దాడులకు విరామం
1
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla