భారత క్రికెట్ జట్టులో అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకరైన రోహిత్ శర్మ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర చర్చ సాగుతోంది. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడు కొనసాగుతాడా లేదా అనే అంశంపై అభిమానులు, మాజీ క్రికెటర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతమంది రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారని పేర్కొన్నాడు. అయితే అలాంటి ఒత్తిడులను రోహిత్ సమర్థంగా ఎదుర్కొంటున్నాడని ప్రశంసించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును ముందుండి నడిపించడమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడని కైఫ్ గుర్తు చేశాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌పై జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేసి తన ఫామ్‌ను మరోసారి నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు.
కొన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లు చేసినంత మాత్రాన రోహిత్ శర్మ ప్రతిభను తక్కువ అంచనా వేయడం సరికాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అభిమానులుగా అందరూ 2027 ప్రపంచకప్ వరకు రోహిత్ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని కోరుకోవాలని సూచించాడు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే, అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ లేదా యశస్వి జైస్వాల్‌లో ఎవరిని ఓపెనర్‌గా ఎంపిక చేస్తారన్న ప్రశ్నకు స్పందిస్తూ, అందరూ ఫిట్‌గా ఉంటే అత్యుత్తమ 11 మంది జట్టులో ఉంటారని చెప్పాడు. జట్టు ఎంపికపై త్వరలో స్పష్టత వస్తుందని తెలిపాడు.
రోహిత్ విఫలం కావాలని కోరుకుంటున్నారు.. కైఫ్ సంచలన వ్యాఖ్యలు
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan