ల్నాడు జిల్లా వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. వినుకొండ మండలం దొండపాడుకు చెందిన షేక్ రఫీ అలియాస్ పొట్టి రఫీ దాదాపు 20 ఏళ్లుగా చోరీలనే వృత్తిగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వినుకొండలోని వేక్షిత జ్యువెలర్స్‌లో మే 21న జరిగిన వెండి చోరీ కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా విశ్లేషణ ద్వారా నిందితుడి కదలికలను గుర్తించి పసుపులేరు వంతెన సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వినుకొండలోని జ్యువెలరీ షాపుతో పాటు పెయింట్, డ్రైఫ్రూట్స్ దుకాణాల్లో చోరీలు చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ప్రకాశం జిల్లా అద్దంకిలో నగదు, బంగారం, ఆటో, బుల్లెట్, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారును చోరీ చేసినట్లు వెల్లడించినట్లు చెప్పారు.
నిందితుడి వద్ద నుంచి రూ.27 లక్షల విలువైన చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7.257 కిలోల వెండి వస్తువులు, ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.70 లక్షల నగదు, ఆటో, బుల్లెట్ ఉన్నాయి.
నిందితుడు గతంలో కూడా పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి విడుదలైన తర్వాత మళ్లీ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించి నగదు బహుమతులు అందజేశారు. నిందితుడిపై నమోదైన ఇతర కేసులపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
25 చోరీల కేసుల్లో నిందితుడు అరెస్ట్.. రూ.27 లక్షల సొత్తు స్వాధీనం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan