లాటిన్ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. సెకన్ల వ్యవధిలో సంభవించిన ఈ భూప్రకంపనలతో రాజధాని కారకాస్‌తో పాటు అనేక నగరాలు దద్దరిల్లాయి. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు 235 మంది ప్రాణాలు కోల్పోగా, 4,300 మందికి పైగా గాయపడ్డారు. భవనాల శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 40 వేల మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భూకంప ప్రభావం అత్యధికంగా లా గువేరా తీర నగరంలో కనిపించింది. సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాల సమాచారం ప్రకారం అక్కడ వందకు పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడం క్లిష్టంగా మారడంతో భారీ యంత్రాలు, ప్రత్యేక శునక దళాలు, అంతర్జాతీయ రెస్క్యూ బృందాలను వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 250 బహుళ అంతస్తుల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెల్లడించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
భూకంప తీవ్రతకు ప్రధాన కారణాల్లో ఒకటి ఉపరితలానికి సమీపంలో సంభవించడం అని భూకంప నిపుణులు చెబుతున్నారు. లోతు తక్కువగా ఉన్న భూకంపాలు ఉపరితలంపై ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. భవనాల నిర్మాణ నాణ్యత, జనసాంద్రత కూడా నష్టాన్ని ప్రభావితం చేస్తాయి.
అత్యవసర సమాచార ప్రసారాన్ని వేగవంతం చేయాలని ఐరాస ప్రతినిధులు వెనెజువెలా ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో, సామాజిక మాధ్యమాలపై ఉన్న ఆంక్షలను సడలించినట్లు సమాచారం. దీంతో ప్రజలు సహాయక కేంద్రాలు, గల్లంతైన వారి వివరాలు, అత్యవసర సేవల సమాచారం వేగంగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది.
ఈ విపత్తు అనంతరం అంతర్జాతీయ సమాజం వెనెజువెలాకు అండగా నిలుస్తోంది. అమెరికా 150 మిలియన్ డాలర్ల విలువైన సహాయక సామగ్రిని పంపనున్నట్లు ప్రకటించింది. సహాయక సామగ్రి తరలింపునకు యుద్ధ నౌకలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసినట్లు తెలిపింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్,
వెనెజువెలాలో రెండు భారీ భూకంపాలు.. మృతులు పెరుగుతూనే, వేల మంది గల్లంతు
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan