పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరీలను పోలీసులు విస్తృతంగా విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ, డిజిటల్ ఆధారాల పరిశీలనలో హత్యకు ముందే పక్కా ప్రణాళిక రూపొందించినట్లు స్పష్టమైన సంకేతాలు లభించాయని అధికారులు వెల్లడించారు.
పోలీసుల ప్రకారం నిందితులు కేతన్‌ను హత్య చేయడానికి ముందు ఇంటర్నెట్‌లో వివిధ హత్య పద్ధతులపై ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశారు. అనంతరం జూన్ 18న తమ ప్రణాళికను అమలు చేసి లోహగడ్ కోట సమీపంలోని లోయలోకి కేతన్‌ను తోసివేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
డిజిటల్ ఫోరెన్సిక్ విచారణలో జనవరి నుంచి జూన్ వరకు నిందితులు మొత్తం 2004 ఫోన్ కాల్స్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ కాలంలో వారు సుమారు 238 గంటల పాటు ఫోన్, వాట్సాప్ కాల్స్, ఫేస్‌టైమ్ ద్వారా పరస్పరం మాట్లాడుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కమ్యూనికేషన్ రికార్డులు కేసులో కీలక ఆధారాలుగా మారాయి.
పుణె ఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ హత్యకు ముందు నుంచే నిందితులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారని తెలిపారు. హత్య జరిగిన రోజు లోహగడ్ కోటకు వెళ్లే ముందు ఇద్దరూ ఒక కేఫ్‌లో కలుసుకుని ప్రణాళికపై చర్చించినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం సేకరించిన కాల్ డేటా, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, ఇతర డిజిటల్ ఫుట్‌ప్రింట్లు ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
టెక్నికల్ విశ్లేషణలో లభించిన ఆధారాల ప్రకారం హత్య ఒక్కసారిగా జరిగిన ఘటన కాదని, చాలా రోజుల ముందే పథకం ప్రకారం అమలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా, సేకరించిన డిజిటల్ ఆధారాలను కోర్టులో సమర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
కేతన్ హత్యకు ఆన్‌లైన్‌లో ప్లాన్.. 2004 కాల్స్‌తో బయటపడిన కుట్ర
12
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan