ప్రవాసాంధ్రుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, APNRTS ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రవాసాంధ్ర భరోసా భీమా (PBB) పథకాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే కోడూరు మండలంలోని గంగరాజుపురం గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రవాసాంధ్రుల భద్రత, సంక్షేమం, ఆర్థిక రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన ప్రతి ప్రవాసాంధ్రుడికి అవసరమైన భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
APNRTS డైరెక్టర్ డా. రివకుమార్ వేమూరి దార్శనికత, సమర్థ నాయకత్వం మరియు నిరంతర పర్యవేక్షణలో ప్రవాసాంధ్రుల సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని APNRTS డైరెక్టర్ (అవేర్‌నెస్ & సర్వీసెస్) నాగేంద్ర బాబు ఆకిశెట్టి తెలిపారు. ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకాన్ని ప్రతి గ్రామంలోని ప్రతి ప్రవాస కుటుంబానికి చేరవేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ప్రవాసాంధ్రులకు భద్రతతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక రక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గ్రామస్థాయిలో ప్రజలకు పథకం ప్రయోజనాలను వివరించి, అర్హులైన ప్రతి ప్రవాస కుటుంబం నమోదు చేసుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమాన్ని పేరూరు గ్రామపంచాయతీ, గంగరాజుపురం ప్రవాసాంధ్రులు (NRIలు) సంయుక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి APNRTS డైరెక్టర్ (అవేర్‌నెస్ & సర్వీసెస్) నాగేంద్ర బాబు ఆకిశెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. NRI నాయకులు కత్రా రమేష్, దాడిశెట్టి సుబ్బరాజు తదితరులు పాల్గొని ప్రవాస కుటుంబాలకు పథకం ప్రయోజనాలను వివరించారు.
ప్రతి ప్రవాసాంధ్ర కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా గ్రామస్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
గ్రామస్థాయికి APNRTS సేవలు.. ప్రవాసాంధ్ర భరోసా భీమాపై అవగాహన
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan