హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం అర్ధరాత్రి లేజర్ లైట్ల ఘటన కలకలం రేపింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన లుఫ్తాన్సా విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కాక్‌పిట్‌పై లేజర్ కాంతులు ప్రసరించడం ఆందోళనకు గురిచేసింది.
అయితే పైలట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా విమానం సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. ల్యాండింగ్ అనంతరం పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు జరిగిన విషయాన్ని నివేదించారు.
పైలట్ ఫిర్యాదు మేరకు విమానాశ్రయ అధికారులు, భద్రతా విభాగాలు ఘటనపై విచారణ ప్రారంభించాయి. లేజర్ కాంతులు ఏ ప్రాంతం నుంచి ప్రసరించాయనే అంశాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఘటనకు బాధ్యులెవరో గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో లేజర్ లైట్ల వినియోగం అత్యంత ప్రమాదకరమని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేజర్ కాంతులు పైలట్ల దృష్టిని కొన్ని క్షణాల పాటు దెబ్బతీసే అవకాశం ఉండటంతో ప్రమాదాలకు దారితీయవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ల్యాండింగ్ సమయంలో ఇలాంటి ఘటనలు తీవ్ర భద్రతా ముప్పుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఏటీసీ అధికారులు హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా విమానాశ్రయ భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లేజర్ లైట్ల కలకలం
4
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan