అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత విద్యార్థులు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. కొలంబియాలోని బుకారమాంగాలో జరిగిన 56వ IPhOలో భారత్ తరఫున పాల్గొన్న ఐదుగురు విద్యార్థులూ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.
పుణెకు చెందిన కనిష్క్ జైన్, ఇండోర్‌కు చెందిన రిద్దేశ్ అనంత్ బెండాలే, ఢిల్లీకి చెందిన రిషిత్ గార్గ్, ముంబైకి చెందిన శ్రేష్ఠ్ సురయ్యా, అహ్మదాబాద్‌కు చెందిన స్వరిత్ జోషి భారత బృందానికి ప్రాతినిధ్యం వహించారు.
ఈ పోటీలో 87 దేశాలకు చెందిన 381 మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ చైనా, కజకస్తాన్, రష్యా, దక్షిణ కొరియా, తైవాన్‌తో కలిసి ఐదు స్వర్ణ పతకాలతో సంయుక్తంగా ప్రపంచ నంబర్ 1 స్థానంలో నిలిచింది.
భారత విద్యార్థుల ఎంపిక, శిక్షణలో హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ కీలక పాత్ర పోషించింది. HBCSE జాతీయ స్థాయి పరీక్షలు, ఎంపిక శిబిరాలు, ప్రయోగాత్మక శిక్షణ ద్వారా విద్యార్థులను అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేసింది.
అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో విద్యార్థులు సైద్ధాంతిక, ప్రయోగాత్మక పరీక్షలను ఎదుర్కోవాలి. భౌతికశాస్త్ర సూత్రాలపై లోతైన అవగాహన, గణిత నైపుణ్యం, ప్రయోగ ఫలితాల విశ్లేషణ, సమస్య పరిష్కార సామర్థ్యాలను పరీక్షిస్తారు.
ఐదుగురూ స్వర్ణాలు గెలవడం భారత సైన్స్ విద్యకు లభించిన గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ విజయం దేశంలోని మరింత మంది విద్యార్థులను భౌతికశాస్త్రం, శాస్త్ర పరిశోధన, సాంకేతిక రంగాల వైపు ఆకర్షించే ప్రేరణగా మారనుంది.
ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో భారత్ గోల్డెన్ స్వీప్, ఐదుగురికీ స్వర్ణాలు
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan