వందే భారత్ రైళ్ల వేగం, ఆధునిక సౌకర్యాలు, ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా వాటిని ఎవరు నడుపుతారు, వారికి ఎంత జీతం వస్తుంది అనే ప్రశ్నలపై ప్రయాణికుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే “వందే భారత్ డ్రైవర్” పేరుతో ప్రత్యేకంగా నేరుగా నియామకాలు జరుగుతాయని భావించడం తప్పు. భారతీయ రైల్వే అధికారిక నియామక వ్యవస్థలో అభ్యర్థులు ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఎంపికవుతారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు విడుదల చేసే కేంద్రీకృత ఉద్యోగ ప్రకటనల ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్లను నియమిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 2026 కేంద్రీకృత ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా పోస్టును అసిస్టెంట్ లోకో పైలట్‌గానే పేర్కొన్నారు. వందే భారత్ కోసం ప్రత్యేక ప్రవేశ పోస్టు లేదా వేరే ప్రారంభ వేతన శ్రేణిని అందులో పేర్కొనలేదు.
అసిస్టెంట్ లోకో పైలట్ కావాలనుకునే అభ్యర్థులు ఆర్‌ఆర్‌బీ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందులో మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రెండో దశ పరీక్ష, కంప్యూటర్ ఆధారిత సామర్థ్య పరీక్ష, పత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లను సంబంధిత రైల్వే జోన్లకు ఆర్‌ఆర్‌బీ సిఫార్సు చేస్తుంది. తుది నియామక ఉత్తర్వులను సంబంధిత రైల్వే పరిపాలన జారీ చేస్తుంది.
ఎంపికైన వెంటనే అభ్యర్థి వందే భారత్ రైలును నడపరు. ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్‌గా ప్రాథమిక, సాంకేతిక, భద్రతా శిక్షణ పొందాలి. అనంతరం విధుల అనుభవం, పదోన్నతులు, సంబంధిత రైలు వ్యవస్థపై శిక్షణ వంటి అంతర్గత ప్రక్రియల ద్వారా లోకో పైలట్ బాధ్యతలకు చేరుకుంటారు.
2026 ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి పదో తరగతి లేదా సమానమైన విద్యార్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి నిర్దేశిత సాంకేతిక ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మన్, డీజిల్ మెకానిక్, టర్నర్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వంటి గుర్తింపు పొందిన ట్రేడ్లు ఇందులో ఉన్నాయి.
వందే భారత్‌ను నడిపేది ఎవరు? ప్రత్యేక పోస్టు కాదు.. జీతం ఇలా
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan