రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ తటస్థ వైఖరి అవలంబించింది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలిచాయి. యుద్ధ ఖైదీల మార్పిడి, అక్రమంగా నిర్బంధితుల విడుదల, ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని తీర్మానం పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సమగ్ర, న్యాయసమ్మతమైన శాంతి నెలకొల్పాలని సభ్య దేశాలు ఆకాంక్షించాయి.