దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. ఇరు రాష్ట్రాల్లో విద్యా సంస్కరణలు, ఐటీ అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్ అంశాలపై చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును కూడా సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉందని సమాచారం
దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీ మంత్రి నారా లోకేశ్
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 తెలంగాణ