హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓట్ల తొలగింపు అంశం చర్చనీయాంశంగా మారింది. 15 నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటర్ జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 47.36 లక్షల ఓటర్లు ఉండగా, 19.41 లక్షల (41 శాతం) పేర్లు జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ (ఏఎస్డీ), డూప్లికేట్ తదితర కారణాలతో ఈ తొలగింపులు జరిగినట్లు పేర్కొంది.
తొలగించిన ఓట్లలో అత్యధికంగా ఏఎస్డీ కేటగిరీకి చెందినవే ఉన్నాయి. మొత్తం 18.01 లక్షల ఓట్లు ఏఎస్డీ కింద ఉండగా, అందులో 13.45 లక్షలు షిఫ్ట్ అయినవిగా చూపించారు. ఆబ్సెంట్ ఓట్లు 2.99 లక్షలు, మరణించిన వారి ఓట్లు 1.56 లక్షలుగా ఉన్నాయి.
అయితే పలువురు ఓటర్లు తాము అదే చిరునామాలో నివసిస్తున్నప్పటికీ ఏఎస్డీ జాబితాలో చేర్చి పేర్లు తొలగించారని ఆరోపిస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకుండా పేర్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు.
వార్డు సభల్లోనూ ఇలాంటి ఫిర్యాదులు అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఇళ్లకు వచ్చి పరిశీలించకుండా, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపులు జరిగాయా అనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
అడ్రస్‌లో లేరంటూ ఓట్లు గల్లంతు.. హైదరాబాద్‌లో 19.41 లక్షల పేర్ల తొలగింపుపై వివాదం
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri