హైదరాబాద్‌లోని ఉప్పుగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫోన్ వినియోగంపై తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక కఠిన నిర్ణయం తీసుకుని ప్రాణాలు కోల్పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన బాలిక నిత్యం ఎక్కువ సమయం ఫోన్‌లో గడిపేది. దీనిని గమనించిన తండ్రి పలుమార్లు ఆమెను మందలించారు. ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది.
గురువారం ఉదయం ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలిక వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయాలకు తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా పిల్లలతో తల్లిదండ్రులు సున్నితంగా మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వారి సమస్యలను తెలుసుకోవడం అవసరమని చెబుతున్నారు.
ఫోన్ వాడొద్దన్న తండ్రి మందలింపుతో బాలిక విషాద నిర్ణయం
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan