తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీ వేదికగా పలు కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మహిళలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని ప్రకటించారు.
‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానుంది. వచ్చే ఏడాది పొంగల్ పండుగ నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని సీఎం విజయ్ తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే విధంగా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుందని, రాష్ట్ర ఖజానాపై ఏడాదికి సుమారు రూ.4,000 కోట్ల భారం పడనుందని తెలిపారు.
అలాగే మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని విస్తరించే ‘వెట్రి పయనం’ పథకాన్ని కూడా ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు.
మరోవైపు చెన్నై సమీపంలోని పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును తమ ప్రభుత్వం కొనసాగించబోదని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు తన మద్దతు ఉంటుందని తెలిపారు.
సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. పొంగల్ నుంచి కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు!
4
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla