తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 22ఏ భూముల అంశంపై స్పందించిన ఆయన, హరీశ్‌రావును ‘అబద్ధాల రావు’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ అంశంలో హరీశ్‌రావు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని విమర్శించారు.
22ఏ వ్యవహారంలో గతంలో సాఫ్ట్‌కాపీ అప్‌లోడ్ చేయకపోవడం వల్ల తప్పు జరిగిన విషయాన్ని తమ ప్రభుత్వమే గుర్తించిందని పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ భూములు కానివి 22ఏ జాబితాలో ఉంటే వాటిని కచ్చితంగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో సామాన్య ప్రజలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
హరీశ్‌రావు విమర్శలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని పొంగులేటి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా సమస్యలను దాటవేసే ప్రయత్నం తమ ప్రభుత్వం చేయదని పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు.
అదే సమయంలో ఓట్ల తొలగింపు అంశంపైనా పొంగులేటి స్పందించారు. కేంద్రం, ఎన్నికల సంఘం, బీఆర్ఎస్ కలిసి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను విజయవంతం కానివ్వబోమని హెచ్చరించారు. 22ఏ భూముల విషయంలో అర్హులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
హరీశ్‌రావు కాదు ‘అబద్ధాల రావు’.. 22ఏ భూముల వివాదంపై మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు
9
Published: 📅
Reported by: 🖊
Banu Prakash