ఉత్తరాఖండ్‌లోని ఆదికైలాస్‌కు వెళ్లిన పర్యాటకులు, యాత్రికులకు భారీ మంచు కారణంగా ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. గత వారం ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో ఆదికైలాస్ మార్గంలోని రహదారులు ఇరుకుగా మారాయి. దీంతో సముద్రమట్టానికి సుమారు 14,500 అడుగుల ఎత్తులో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ‘వైట్ ట్రాఫిక్ జామ్’ ఏర్పడింది.
కొన్ని ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై పేరుకున్న మంచును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తొలగిస్తున్నప్పటికీ, రోడ్ల ఇరువైపులా మంచు పూర్తిగా తొలగించకపోవడంతో ప్రయాణ మార్గం మరింత ఇరుకుగా మారింది.
దీనికి తోడు వారాంతంలో ఆదికైలాస్‌కు వెళ్లే పర్యాటకులు, యాత్రికుల సంఖ్య భారీగా పెరగడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో వాహనాలు దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల మేర బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలి సంవత్సరాల్లో ఆదికైలాస్, ఓం పర్వత్, మున్సియారీ వంటి హిమాలయ ప్రాంతాలపై పర్యాటకుల ఆసక్తి గణనీయంగా పెరిగింది. 2026లో ఇప్పటివరకు 61 వేల మందికి పైగా ఆదికైలాస్‌ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే ఎల్గడ్, కులగడ్, ఎస్-బెండ్, మాల్ఘాట్ వంటి ప్రాంతాల్లో రహదారులు ఇప్పటికే ఇరుకుగా ఉండటం, మంచు పేరుకుపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోంది. యాత్రికులు వాతావరణ పరిస్థితులను ముందుగా తెలుసుకుని ప్రయాణించాల్సిన అవసరం ఉంది.
ఆదికైలాస్‌లో ‘వైట్ ట్రాఫిక్ జామ్’.. 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
2
Published: 📅
Reported by: 🖊
Kanakadri