ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డ్రీమ్బీన్స్ యాప్ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికా తర్వాత ఈ సేవలను పొందుతున్న తొలి దేశంగా భారత్ నిలిచింది. వినియోగదారుల ఆన్లైన్ కార్యకలాపాలు, ఆసక్తులు, వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించి ప్రత్యేకమైన కథనాలను రూపొందించడం ఈ యాప్ ప్రత్యేకత.
డ్రీమ్బీన్స్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇంగ్లిష్తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ సహా పలు భారతీయ భాషల్లో సేవలు అందిస్తుంది.
డ్రీమ్బీన్స్ ఎలా పనిచేస్తుంది?
వినియోగదారుల అనుమతితో జీమెయిల్, గూగుల్ ఫొటోస్, క్యాలెండర్, జెమిని, సెర్చ్, యూట్యూబ్ వంటి సేవల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది. ఆ వివరాలను విశ్లేషించి ప్రత్యేక ప్రాంప్ట్ అవసరం లేకుండానే వ్యక్తిగత ఆసక్తులకు అనుగుణంగా కథనాలను రూపొందిస్తుంది.
ఈ కథనాలను వినియోగదారులు చదవడంతో పాటు బుక్మార్క్ చేసుకోవచ్చు. ఇతరులతో పంచుకునే సదుపాయం కూడా ఉంది.
యాప్ను గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత గూగుల్ ఖాతాతో లాగిన్ అయి అవసరమైన సేవలను అనుసంధానం చేయాలి. అనంతరం కావాల్సిన భాషను ఎంపిక చేసుకోవచ్చు.
ప్రైవసీ విషయంలోనూ గూగుల్ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఏ సేవల నుంచి సమాచారం పొందాలన్నది వినియోగదారులే నిర్ణయించుకోవచ్చు. రూపొందించిన కథనాలను తొలగించడంతో పాటు యాప్ డేటాను కూడా డిలీట్ చేసుకునే అవకాశం కల్పించింది.
ప్రస్తుతం వ్యక్తిగత జీమెయిల్ ఖాతాదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల కథనాలు వారికి మాత్రమే కనిపిస్తాయని సంస్థ వెల్లడించింది. వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా సమాచారాన్ని అందించడం ద్వారా డ్రీమ్బీన్స్ ప్రత్యేక అనుభూతిని కల్పించనుంది. తెలుగు భాషలోనూ సేవలు అందుబాటులోకి రావడం స్థానిక వినియోగదారులకు ఉపయోగకరంగా మారనుంది.
భారత్లోకి గూగుల్ కొత్త AI యాప్ డ్రీమ్బీన్స్.. మీ ఆన్లైన్ జీవితాన్ని కథలుగా మార్చే సరికొత్త టెక్నాలజీ!
17
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan