హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన 27 ఏళ్ల యువకుడిపై ఏకంగా 59 క్రిమినల్ కేసులు నమోదై ఉండటం సంచలనం సృష్టించింది. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తల్లగడ్డ గ్రామానికి చెందిన కేసరి మణికంఠ అలియాస్ నరమ్దాస్ మణికంఠ, మున్నా, మణి సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ ఎదుట ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నాడు. అతడి వయసు 27 ఏళ్లు కాగా, వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 59 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అక్టోబర్ 27న మహిళపై హత్యాయత్నానికి పాల్పడినట్లు మణికంఠపై ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు గడ్డిఅన్నారం ప్రాంతంలోని మహిళల హాస్టల్లోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి మహిళలు ప్రశ్నించడంతో తాను ప్లంబర్నని చెప్పాడు. అనుమానం వచ్చిన మహిళలు అతడి ఫోన్ ద్వారా వార్డెన్‌కు కాల్ చేయగా స్పందన రాలేదు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అనంతరం ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడి ఆమె మొబైల్ ఫోన్‌తో పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన మలక్‌పేట పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు దోచుకున్న మొబైల్ ఫోన్‌ను రూ.2 వేలకు విక్రయించినట్లు గుర్తించారు. ఆ డబ్బుతో వనస్థలిపురంలోని ఓ బార్లో మద్యం తాగుతుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.
విచారణ సమయంలో గోపాల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో పల్సర్ బైక్ చోరీ చేసినట్లు నిందితుడు వెల్లడించాడని అధికారులు తెలిపారు. ఈ దొంగతనంలో వరంగల్ జిల్లా శివనగర్‌కు చెందిన నారపోగు వంశీకృష్ణ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్‌కుమార్ సహకరించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
మహిళపై హత్యాయత్నం ఘటనతో పాటు నిందితుడి గత నేరచరిత్రపై మలక్‌పేట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో ఇతరుల పాత్రపై కూడా విచారణ చేపట్టారు. నిందితులపై నమోదైన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను
వయసు 27 ఏళ్లే.. 59 క్రిమినల్ కేసులు! మలక్‌పేట మహిళ హత్యాయత్నం కేసులో షాకింగ్ నిజాలు
11