ఆన్లైన్లో చిన్న టాస్కులు పూర్తి చేస్తే రోజుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదించవచ్చని నమ్మించి హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.12.56 లక్షలు కాజేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.
మదీనాగూడకు చెందిన బాధితుడికి సెప్టెంబర్ 25న టెలిగ్రామ్ ద్వారా ఓ సందేశం వచ్చింది. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పనులు, ఐదు నక్షత్రాల రేటింగ్ టాస్కులు పూర్తి చేస్తే ఒక్కో టాస్కుకు రూ.880 చెల్లిస్తామని నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట కొన్ని టాస్కులు చేయించి కొంత డబ్బు చెల్లించడం ద్వారా అతడిలో నమ్మకం కలిగించారు.
తర్వాత బాధితుడిని ఓ వీఐపీ గ్రూపులో చేర్చి బుకింగ్లు, ‘వెల్ఫేర్ టాస్క్’, ‘ప్రైమ్ టాస్క్’ పేర్లతో వరుసగా భారీ మొత్తాలు చెల్లించేలా చేశారు. వెబ్సైట్లో పెద్ద లాభాలు వచ్చినట్లు చూపించి మరింత పెట్టుబడి పెట్టించారని పోలీసులు తెలిపారు.
బాధితుడు సొమ్మును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా, విధానం పాటించలేదంటూ ఖాతాను నిలిపివేసినట్లు చూపించారు. ఖాతా తిరిగి తెరవడానికి రూ.5.95 లక్షల సెక్యూరిటీ డిపాజిట్, అనంతరం టీడీఎస్ పేరుతో మరో రూ.5.36 లక్షలు చెల్లించాలని కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంకా డబ్బు డిమాండ్ చేయడంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆన్లైన్ టాస్కుల పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఆన్లైన్ టాస్కుల పేరుతో రూ.12.56 లక్షల మోసం.. టెలిగ్రామ్ ద్వారా వల
14