అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,260గా నమోదైంది.
నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,690 తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,30,400గా ఉండగా, ఇది రూ.1,550 తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,06,690గా ఉంది.
తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతిలో కూడా 24 క్యారెట్ల బంగారం రూ.1,42,260, 22 క్యారెట్లు రూ.1,30,400గా నమోదైంది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలు సమాన స్థాయిలో ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,410గా, 22 క్యారెట్లు రూ.1,30,550గా ఉంది. వడోదరాలో 24 క్యారెట్ల ధర రూ.1,42,310గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,10,000కు చేరింది. ధరలు తరచూ మారుతుండటంతో కొనుగోలు ముందు తాజా రేట్లను మరోసారి పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు.
పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. హైదరాబాద్లో 24 క్యారెట్లు రూ.1.42 లక్షలు
18
Published: 📅
Reported by: 🖊
Kanakadri