యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా తుది జట్టులో అవకాశాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ స్పందించాడు. సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ వరుసగా విఫలమవుతుండటంతో అతడి స్థానంలో వైభవ్‌కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే వైభవ్ అవకాశాల కోసం ఎదురుచూడాల్సిందేనని జట్టు కోచ్‌లు ఇప్పటికే సూచించారు.
వెస్టిండీస్‌తో తొలి టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన మోర్నె మోర్కెల్.. వైభవ్‌కు కీలక సూచనలు చేశాడు. వైభవ్‌లో ఉన్న ప్రతిభ అందరికీ తెలుసని, అతడు నాణ్యమైన ఆటగాళ్లతో కలిసి ఎక్కువ సమయం గడపడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపాడు. సీనియర్ క్రికెటర్లతో కలిసి శిక్షణ తీసుకోవడం అతడి ఆటను మెరుగుపరచడంలో సహాయపడుతుందని పేర్కొన్నాడు.
మ్యాచ్ ఆడే అవకాశం వెంటనే రాకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదని మోర్కెల్ సూచించాడు. జట్టుతో కలిసి ప్రయాణించడం, డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండటం, హోటల్లో సహచరులతో గడపడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పాడు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు తమ ఇన్నింగ్స్‌కు ఎలా సిద్ధమవుతారు, ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకుంటారు వంటి అంశాలను గమనించడం యువ ఆటగాళ్లకు ఎంతో కీలకమని తెలిపాడు.
ఇదే సమయంలో వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడా అనే ప్రశ్నకు మోర్కెల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఆసియా క్రీడల్లో ఆ కాంబినేషన్‌ను ఉపయోగించినప్పటికీ, ప్రస్తుత సిరీస్‌కు అత్యుత్తమ కాంబినేషన్‌ను మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తామని పేర్కొన్నాడు.
ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్
25