భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల ఎదుర్కొన్న బ్యాటింగ్ వైఫల్యాలపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందించారు. ఒకటిరెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదని వారి కెరీర్‌ను తక్కువగా అంచనా వేయడం సరికాదని స్పష్టం చేశారు.
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్, కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. నాలుగో వన్డేలో కోహ్లీ డకౌట్ కాగా, రోహిత్ తొలి బంతికే ఔటయ్యాడు.
ఐదో వన్డేలోనూ ఇద్దరూ నిరాశపరిచారు. కోహ్లీ ఐదు పరుగులు చేయగా, రోహిత్ ఏడు పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో వారి ఫామ్‌పై విమర్శలు మొదలయ్యాయి.
2027 వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్‌ను భావిస్తున్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై చర్చ జరుగుతోంది.
ఈ విమర్శలపై అజయ్ జడేజా స్పందిస్తూ, రోహిత్, కోహ్లీ దాదాపు 14 ఏళ్లుగా భారత క్రికెట్‌కు విశేష సేవలందించారని గుర్తుచేశారు.
ఒక్క మ్యాచ్ లేదా ఒక సిరీస్ ఫలితం ఆధారంగా వారి గొప్పతనాన్ని నిర్ణయించలేమని పేర్కొన్నారు. కెరీర్ మొత్తంలో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రతి క్రికెటర్ తన పర్యటనను విజయంతో ముగించాలని కోరుకుంటాడని, అయితే కొన్ని సందర్భాల్లో త్వరగా ఔటవడం సహజమని వివరించారు.
రోహిత్, కోహ్లీ కెరీర్ చివరి దశలో ఉన్నారని అభిప్రాయపడిన జడేజా, ప్రస్తుతం వారు స్వేచ్ఛగా క్రికెట్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా విరాట్ కోహ్లీ మైదానంలో ప్రదర్శించే ఉత్సాహాన్ని జడేజా ప్రశంసించారు. అతడి బ్యాటింగ్‌తో పాటు మైదానంలో కనిపించే దూకుడు కూడా అభిమానులకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు.
కోహ్లీ త్వరగా ఔటైనా సహచర ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కనిపించాడని గుర్తుచేశారు. క్యాచ్ చేజారినప్పుడు అతడు వ్యక్తం చేసిన ఆవేశాన్ని కూడా ప్రస్తావించారు.
కోహ్లీ సహజమైన పోరాట స్ఫూర్తి ఇప్పటికీ మారలేదని జడేజా అభిప్రాయపడ్డారు. అభిమానులు చూడాలనుకునే కోహ్లీ మైదానంలో కనిపిస్తున్నాడని తెలిపారు.
రెండు మ్యాచ్‌లతో రోహిత్, కోహ్లీ స్థాయిని నిర్ణయించలేం.. విమర్శలకు అజయ్ జడేజా కౌంటర్!
5
Published: 📅
Reported by: 🖊
Banu Prakash