ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు వెలిగొండ ప్రాజెక్టు ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు కలను సీఎం చంద్రబాబు నాయుడు నిజం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు 31న వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు సీఎం చంద్రబాబు విడుదల చేస్తారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు.
ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే నీటిని విడుదల చేయాలని సీఎం ఆదేశించారని నిమ్మల తెలిపారు. మూడు దశల్లో 40 రోజుల్లోనే రూ.760 కోట్ల పరిహారాన్ని నిర్వాసితులకు అందించామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులకు రూ.3 వేల కోట్ల పరిహారం పంపిణీ చేసినట్లు చెప్పారు.
వెలిగొండ పనులు పూర్తికాకుండానే గత ప్రభుత్వం ప్రారంభించిందని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో వెలిగొండ జలాలతో ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం.. ఆగస్టు 31న కృష్ణా జలాలు విడుదల
20
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati