హోర్ముజ్ జలసంధిలో భారత నావికుల నౌకపై దాడి.. బయటకు వచ్చిన వీడియోహోర్ముజ్ జలసంధిలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై జరిగిన దాడి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
FSUI ప్రకారం.. 21 మంది భారతీయులతో సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్న నౌకను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన సాయుధ పడవలు చుట్టుముట్టాయి. అనంతరం నౌకపై ఆర్పీజీ కాల్పులు జరిపినట్లు యూనియన్ ఆరోపించింది. ఈ దాడితో భయాందోళనకు గురైన సిబ్బంది నౌకలోపల దాక్కున్నట్లు తెలిపింది.
“వీరు సముద్రపు దొంగలు కాదు.. ఐఆర్జీసీకి చెందిన నావికా దళాలు” అంటూ FSUI పేర్కొంది. వాణిజ్య నౌకల్లో పనిచేసే పౌర సిబ్బందిని కేవలం భద్రతా మార్గదర్శకాలతో రక్షించడం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగా, హోర్ముజ్ జలసంధిలో రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ గతంలో ప్రకటించింది. ఈ ఘటనల్లో ప్రభావితమైన నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నట్లు భారత ఓడరేవులు, నౌకాయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది
హోర్ముజ్‌లో భారత నావికుల నౌకపై దాడి వీడియో.. ఐఆర్జీసీపై సీమెన్స్ యూనియన్ ఆరోపణలు
9
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk