ఫుట్‌బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీకి ఉన్న ప్రత్యేక స్థానం మరోసారి రుజువైంది. అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ధరించిన ఓ జెర్సీ వేలంలో ఏకంగా రూ.56.4 లక్షల ధర పలికింది.
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన అరుదైన ఫుట్‌బాల్ వస్తువులను వేలం నిర్వహించగా, మెస్సీ జెర్సీకి భారీ డిమాండ్ ఏర్పడింది. బార్సిలోనా తరఫున ఆడిన సమయంలో మెస్సీ ధరించిన ఈ జెర్సీ 66,107 డాలర్లకు విక్రయమైంది.
ఈ జెర్సీ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 2012లో బార్సిలోనా, మాంచెస్టర్ యునైటెడ్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా రాడ్ థార్న్‌లే మెస్సీ జెర్సీని పొందాలని కోరుకున్నారు. మ్యాచ్ అనంతరం బార్సిలోనా ఆటగాడు గెరార్డ్ పిక్వె అతడిని జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. అక్కడ మెస్సీ స్వయంగా తాను ధరించిన జెర్సీని తీసి, సంతకం చేసి థార్న్‌లేకు అందించారు.
ఈ అరుదైన జ్ఞాపకం కేవలం ఓ క్రీడా దుస్తువుగా కాకుండా, ప్రపంచ స్థాయి ఆటగాడి గుర్తుగా నిలిచింది. అందుకే వేలంలో దీనికి భారీ ధర లభించింది.
ఇదే వేలంలో మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ధరించిన రియల్ మాడ్రిడ్ జెర్సీ రూ.9.05 లక్షలకు అమ్ముడైంది. మెస్సీ జెర్సీ ధర దానికంటే అనేక రెట్లు ఎక్కువ పలకడం అతడి ప్రపంచవ్యాప్త అభిమానాన్ని మరోసారి చాటింది.
మెస్సీ జెర్సీకి భారీ డిమాండ్.. వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడైన అరుదైన జ్ఞాపకం
9
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati