దక్షిణ భారత రాష్ట్రాలు దేశ ప్రగతికి ప్రధాన స్తంభాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని సూచించారు. తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం తప్పు కాదని, అయితే కొన్ని రాష్ట్రాలు ఏళ్లుగా నీటి కొరతను ఎదుర్కొంటున్న సమయంలో నీరు సముద్రంలోకి వృథాగా వెళ్లడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని అమిత్‌షా పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి చర్చల ద్వారా పెండింగ్‌లో ఉన్న అంతర్రాష్ట్ర జల సమస్యలను వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
బ్రహ్మపుత్ర నుంచి గోదావరి, కావేరి వరకు ప్రధాన నదులను అనుసంధానించడం ద్వారా భవిష్యత్‌లో నీటి కొరతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నదుల అనుసంధానం వల్ల జలమార్గాలు, తక్కువ ఖర్చుతో రవాణా, ఇంధన ఆదా వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు.
ఐటీ, ఆటోమొబైల్స్, ఔషధ తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమిత్‌షా ప్రశంసించారు. అధిక అక్షరాస్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సముద్ర వనరుల వినియోగంలో సాంకేతిక నైపుణ్యం దక్షిణాది అభివృద్ధికి కీలక కారణాలని పేర్కొన్నారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రాల మధ్య సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి–బెంగళూరు–చెన్నైలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దక్షిణాది రాష్ట్రాలు సమష్టిగా పనిచేస్తే 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగగలవని చంద్రబాబు పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాలే దేశాభివృద్ధికి మూలస్తంభాలు: అమిత్‌షా
13
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk