భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా విదేశీ గడ్డపై సీమింగ్, బౌన్సింగ్ పరిస్థితుల్లో భారత బ్యాటర్లు రాణించే విషయంలో కోహ్లీ మరింత ముందుకు వెళ్లాడని అభిప్రాయపడ్డారు.
సచిన్ టెండూల్కర్ చాలా కాలం క్రితమే ఈ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారని డివిలియర్స్ పేర్కొన్నారు. బౌన్సింగ్, సీమింగ్ పరిస్థితుల్లో ఉపఖండానికి చెందిన బ్యాటర్ కూడా విజయవంతం కావచ్చని సచిన్ తొలిసారి నిరూపించారని చెప్పారు. అయితే విరాట్ కోహ్లీ ఆ స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లి ప్రమాణాలను పెంచాడని అన్నారు.
విదేశీ పర్యటనల్లో సచిన్, కోహ్లీ సాధించిన విజయాలు ప్రస్తుత తరం భారత బ్యాటర్లకు స్ఫూర్తిగా నిలిచాయని డివిలియర్స్ తెలిపారు. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లు కూడా వారి నుంచి స్ఫూర్తి పొంది విదేశీ పరిస్థితుల్లో తమ ఆటను మెరుగుపరుచుకుంటున్నారని పేర్కొన్నారు.
రాహుల్ భారీ ఇన్నింగ్స్‌లపై దృష్టి పెట్టాలికేఎల్ రాహుల్ టెక్నిక్ పరంగా ఎంతో నమ్మకమైన ఆటగాడని, భారత జట్టుకు అతడు కీలక ఆస్తి అని డివిలియర్స్ ప్రశంసించారు. అయితే విదేశాల్లో అతడి సగటు సుమారు 34 పరుగుల వద్ద ఉండటంతో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు.
క్రీజులో కుదురుకున్న తర్వాత సెంచరీతో సరిపెట్టుకోకుండా 180 పరుగుల వంటి భారీ స్కోర్లు సాధించడంపై రాహుల్ దృష్టి పెట్టాలని సూచించారు. కొత్త బంతితో వికెట్ కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఒకసారి క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత ఆ అవకాశాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మార్చుకోవాలని డివిలియర్స్ పేర్కొన్నారు.
విదేశీ గడ్డపై సచిన్ కంటే కోహ్లినే బెటర్: ఏబీ డివిలియర్స్
16