అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై మునుపెన్నడూ లేని విధంగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ వెల్లడించింది.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలీబఫ్ మాట్లాడుతూ ఆర్థిక ఆంక్షలు తమ దేశాన్ని ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఆలీ అబ్దొల్లాహీ మాట్లాడుతూ భూతల, వాయు, సముద్ర మార్గాల్లో జరిగే ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామని తెలిపారు.
ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాపై ప్రభావం చూపేలా డ్రోన్లు, క్షిపణుల వినియోగం కొనసాగుతోందని సమాచారం. ఈ పరిణామాల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.
ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్లకుండా చూడాలని అమెరికా స్పష్టం చేస్తోంది. తమ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. హోర్ముజ్ ప్రాంతంపై ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెరికా ఆంక్షలకు సిద్ధం.. ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామని ఇరాన్ హెచ్చరిక
4
Published: 📅
Reported by: 🖊
Kanakadri